వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు ఇరు పక్షాల వాదలను విన్న తెలంగాణ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ బెయిల్ పిటిషన్‌పై పది రోజుల నుంచి హైడ్రామా నడుస్తోంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన అవినాష్ ముందస్తు బెయిల్ కోసం పోరాడారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సీబీఐ దీనిపై ఏం చేస్తుందో చూడాలి. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు దర్యాప్తులో అవినాష్ ఎక్కడ సహకరించడం లేదని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
హత్యకు మూడు నెలల ముందే కుట్ర జరిగిందని వివరించారు. రాజకీయ కోణంలోనే హత్య జరిగిదని పేర్కొన్నారు. ఏ ఆధారాలతో అవినాష్‌పై అభియోగాలు మోపుతున్నారని సీబీఐ హైకోర్టు వెకేషన్ బెంచ్ ప్రశ్నిస్తే… ఓ సీల్డ్ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలను సమర్పించారు. ప్రస్తుత దశలో పిటిషనర్‌కు ఆ వివరాలు ఇవ్వలేమని సీబీఐ చెప్పేసింది. ఓ కీలక సాక్షి ఇందులో ప్రధానమని వెల్లడించింది. హత్య జరిగిన రోజున నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తారని ప్రశ్నించింది కోర్టు. ఆధారాల సేకరణ ఎందుకు ఆలస్యమైందని క్వశ్చన్ చేసింది. లోక్ సభ అభ్యర్థిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారు కదా ఆయన్ని అందరూ సమర్థిస్తున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది.
సమాజ శ్రేయస్సు కోరమండల్ మహిళా క్లబ్ లక్ష్యం.
2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మేనేజ్ చేసి ఉండొచ్చుకదా… హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేసింది. గదిలో రక్తం తుడిస్తే ఏమవుతుందని కోర్టు ప్రశ్నించింది. శరీరంపై గాయాలు ఉంటే అది హత్య అని తెలుస్తుంది కదా అని అనుమానం వ్యక్తం చేసింది. హత్య అని తెలిసినప్పుడు రక్తపు మరకలతో అవసరం ఏముంటుందని అడిగింది. అవినాష్ వాట్సాప్ డేటా తీసుకున్నారా అని కోర్టు అడిగింది. ఏ 1 వాట్సాప్ టేడా తీసుకున్నారా అని అడిగింది. దీనికి సమాధానం చెప్పిన సీబీఐ… చాట్ చేయలేదని గంగిరెడ్డి చెప్పారని పేర్కొంది.
మరి తెల్లవారు జామున అవినాష్ ఎవరితో చాట్ చేశారని అడిగింది. అది ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుంటే తెలుస్తుందని సమాధానం చెప్పింది. ఐపీడీఆర్ ద్వారా వాట్సాప్ కాల్ గురించి మాత్రమే తెలుస్తుందని చెప్పింది. ఆ టైంలో ఎవరెవరి వాట్సాప్ యాక్టివ్‌లో ఉందని కోర్టు అడిగింది. ఇంత కీలకమై కేసులో అవినాష్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.27న ఈ వాదనలు జరిగిన తర్వాత ఆయనకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించింది. 31 తుది తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఇవాళ(బుధవారం) అవినాష్‌కు ముదస్తు బెయిల్ ఇస్తూ ఫైనల్ తీర్పు చెప్పేసింది.