Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జిల్లా కలెక్టర్ చెప్పినా… తగ్గేదేలేదంటూ  రెచ్చిపోతున్న మట్టి మాఫియా..

0

చాట్రాయి మండలం చనుబండ గ్రామ చిన్న చెరువులో యధేచ్చగా అడ్డు అదుపు లేకుండా మట్టి దోపిడీకి గురవుతున్నా..రెవిన్యూ,ఇరిగేషన్ అధికారుల కన్నెత్తి చూడకపోవడంతో చెరువుకు అనుకుని నివాసం ఉంటున్న గ్రామ ప్రజలు మట్టి అక్రమ రవాణాను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. చెరువులో మట్టి దోపిడీతో భారీ గుంతలు ఏర్పడి చిన్నారుల పాలిట ప్రమాదభరితంగా మారిందని, సత్తుపల్లి వెళ్ళే మార్గపు ప్రధాన రహాదారి అడుగుభాగం మట్టిని కూడా తీసివేయడంతో అక్రమార్కుల దాటికి చెరువుకట్ట కుంగి పోయే ప్రమాదం వుందని టిడిపి నేతలు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

నేల తల్లిని ముద్దాడిన నారా లోకేష్ బాబు.. జన సంద్రంగా మారిన యువ గళం పాదయాత్ర..

నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న గ్రావెల్, మట్టి మాఫియాను అరికట్టాలని పలుమార్లు అధికార యంత్రాంగంకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీ వాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా పరిశీలించి మట్టి దోపిడీకి కాకుండా చూడాలని ఆదేశించినా, చర్యలు శూన్యమని టిడిపి నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు తెలిపారు. జగనన్న ఇళ్ళ పేరుతో మట్టిని అమ్ముకుని అధికార పార్టీ నేతలు సొమ్ములు చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మట్టి దందాలో అధికారులకు వాటాలు ఇస్తున్నామని అక్రమార్కులు చెప్పడం వెనుక చనుబండ గ్రామ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie