Siricilla Floods: సిరిసిల్ల వరదల పాపం అధికారులదే..
The sin of Sirisilla floods lies with the authorities
- బీజేపి కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు
- చెరువు కట్ట తెగుతుందని ముంతే తెలిసిన చర్యలు లేవు..
- ఐదు నెలల కొందనే రాతపూర్వకగా మున్సిపల్ కమీషనర్కు, ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు
- ఐన తేరుకోని మున్సిపల్, ఇరిగేషన్ శాఖ.. ప్రజలకు తీవ్ర ఆస్థి నష్టం..
- రూ.3లక్షల మరమ్మత్తుకు కేటాయిస్తే.. రూ.కోట్ల ఆస్తి నష్టం నుంచి బయటపడే వారు
- సిరిసిల్ల అధికారుల తీరుతో ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కు చెడ్డపేరు
- సిరిసిల్ల లో తీవ్ర విమర్శలు..
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో వరదలకు సంబందించిన ప్రజల ఇక్కట్లు, తీవ్ర ఆస్తి నష్టం ప్రకృతి వైపరీత్యం కాదు.. అధికారుల తప్పిదమే అని.. బహిర్గతమైంది. చెరువు కట్ట తెగుతుందని ఐదు నెలల కిందనే బీజేపి నేత, మున్సిపల్ కౌన్సిలర్ రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.. కేవలం రూ.లక్షల మరమ్మతు ఖర్చులను పట్టించుకోకపోవడంతో సిరిసిల్ల ప్రజానీక కంటీ మీద నిద్రలేకుండా చేశారు.. కోట్లలో ఆస్థి నష్టం వాటిల్లెల చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం సిరిసిల్ల లో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడటం, ఒక ప్రాణం గాలిలో కలవడం, కోట్లలో ఆస్థి నష్టం జరగడం తెలిసిన విషయంమే. దీంతో మంత్రి కేటీఆర్ కల్పించుకోని శాశ్వాత పరిష్కారం కోసం రూ.కోట్లు వెచ్చి వదర మళ్లీంపు చర్యలు చేపట్టారు.
కాలువ నిర్మాణంకు నిధులు కేటాయించిన అధికారుల వైఫల్యం కాంట్రాక్టర్లు సరిగా పని చేయక మధ్యలో వదిలేశారు. ఐన అధికారులు కచ్చ కాల్వలతో వరద నీటిని తాత్కాలికంగా బయటకు పంపించి.. గత ఏడాది వరదల బారి నుంచి ప్రజలను తప్పించారు. కానీ గురువారం మానవ తప్పిదం వల్లే చెరువు కట్ట తెగిపోయి.. సిరిసిల్ల పట్టణం జలదిగ్బందంలో చిక్కుకుందని స్పష్టమైంది. ఐదు నెలల క్రితం ఫిబ్రవరి 24న చిన్నబోనాల మున్సిపల్ కౌన్సిలర్ రాతపూర్వకంగా మున్సిపల్ కౌన్సిలర్కు ఫిర్యాదు చేశారు. చిన్నబోనాల చెరువుకు బుంగ పడిందని, చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని, ఈ చెరువు కట్ట తెగితే కింద ఉన్న రైతుల పోలాలు, సిరిసిల్ల పట్టణం మొత్త మునుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐన అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ వైపరీత్యం జరిగిందని బీజేపి నేత , మున్సిపల్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రెండు మూడు లక్షల రూపాయల ఖర్చు పెట్టి మరమ్మతు చర్యలు చేపడితే ఈ రోజు ఇంత ఆస్తి నష్టం జరగకపోయేదని పేర్కొన్నారు. మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య మాత్రం తాను ఆ లెటర్ను ఇరిగేషన్ శాఖ అధికారులకు పంపించానని ముద్రకు తెలిపారు. ఏది ఏమైన అధికారు తప్పిదం.. సిరిసిల్ల ప్రజలకు బారి నష్టం వాటిల్లింది. మంత్రి కేటీఆర్కు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని సిరిసిల్ల లో పలువురు చర్చించుకుంటున్నారు.