జిల్లా ఎస్పీ మలిక గర్గ్
ఒంగోలు:క్షేత్ర స్థాయిలో పోలీసు శాఖ ప్రతినిధులుగా మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మార్చి నెలల్లో వార్డ్ మహిళా పోలీసు జీ మౌనిక విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరచిన మహిళా పోలీసులను ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అంశాలు, బాల్య వివాహాలు నివారణ, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యక్రమాల గురించి క్షేత్ర స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వడం, ప్రజలకు సీసీ కెమెరాలు ఆవశ్యకతను వివరించి ఇన్స్టలేషన్ చేయించటం, నంబర్ ప్లేట్ వాహనాలు, పోలీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేని ఆటోలను గుర్తించడం, కొత్త వ్యక్తుల యొక్క సమాచారాన్ని సేకరించటం, దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం, సైబర్ క్రైమ్ మరియు జాబ్ మోసాలపై మీద అవగాహన కల్పించడం మొదలైన విధుల్లో చురుగ్గా పనిచేసినందుకు మార్చి నెలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన టాప్-5 గ్రామ/వార్డ్ మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేసారు. జీ . మౌనిక, గిద్దలూరు పీఎస్., ఎం స్వర్ణ లత, పొన్నలూరు పీఎస్., ఎస్ అశ్విని, గిద్దలూరు పీఎస్., వి. రేణుక, గిద్దలూరు పీఎస్., ఈ . జయకమల, మార్కాపూర్ టౌన్ పీఎస్ లకు ప్రశంసాలందచేసారు.