కాకినాడ: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న కుంచె దుర్గాప్రసాద్ అనే బాలుడు మంగళవారం రాత్రి హాస్టల్ లో కనిపించడం లేదంటూ హాస్టల్ వార్డెన్ వివి.కృష్ణ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు పై కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు తక్షణం జగ్గంపేట సిఐ బి.సూర్య అప్పారావు పర్యవేక్షణలో జగ్గంపేట ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, బాలుడి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టారు.
దీనిలో భాగంగా జగ్గంపేట మెయిన్ రోడ్డు ఇతర ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి, టేక్నాలజీ పరిజ్ఞానంతో పరిశీలించగా బాలుడు రాజమండ్రి రోడ్ లో ఆటో ఎక్కినట్టు తెలియడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని పోలీసులు జల్లెడ పట్టి,రాజమండ్రి సమీపంలోని కొన్ని ప్రాంతాలలో వెతకగా తెల్లవారుజామున 3:30 నిమిషములకు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ లో బాలుడిని గుర్తించి జగ్గంపేట స్టేషన్ కు తీసుకువచ్చారు. సీఐ సూర్య అప్పారావు,ఎస్సై విద్యాసాగర్ లు బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి, హాస్టల్ వార్డెన్ కృష్ణకు కుంచే దుర్గాప్రసాద్ ను అప్పగించారు. ఈ యొక్క మిస్సింగ్ కేసును ఏడు గంటల వ్యవధిలో సురక్షితంగా చేధించడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జగ్గంపేట సీఐ, ఎస్ఐ, సిబ్బందిని అభినందించారు.