మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు అంజిరెడ్డి -పుష్పలత దంపతుల కుమారుడు శివ మారుతి రెడ్డి ఇటివల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ లో 132వ ర్యాంకు సాధించిన సందర్భంగా మంగళవారం కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మారుతి రెడ్డి ని తన సొంత ఇంట్లో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి
అభినందించి ,శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు..ఎమ్మెల్యే వెంట ఎంపీపీ తోట నారాయణ, జడ్పిటిసి దారిశెట్టి లావణ్య- రాజేష్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక సర్పంచ్ పిడుగు రాధా- సందయ్య పాల్గొన్నారు.
మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు. బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.