తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు పగటిపూట బయటకు రావొద్దని సూచించింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వగగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో రాగల మూడు రోజులపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.
రాగల మూడు రోజులపాటు అత్యవసరమైతే తప్ప పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు.. రాగల మూడు రోజులు ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. నేడు, రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. ఎల్లుండి రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజులలో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని వెల్లడించారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని… అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
వీసీపై వేటు.. అధికారం ఎవరికి..
ఇక అటు తెలంగాణ లో కూడా కూడా ఈ నెల 21 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. నెల్లూరు తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఏపీ వెదర్ మెన్ పేర్కొంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తీర ప్రాంతల్లో మరికొద్ది గంటల్లో చినుకులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతానికి తూర్పు రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో ఆకాశం పూర్తి స్ధాయిలో మేఘావృతం అయ్యి ఉంది. కానీ రాత్రి సమయం వెళ్లేసరికి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ వర్షాలు జోరందుకుంటాయని వివరించింది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో అధిక వర్షపాతం నమోదవ్వనుంది.