సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంధ్లాపూర్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ క్యాంపులో పనిచేసే బిహార్ కు చెందిన ప్రేమ్ నాథ్ యాదవ్ కవిత కుమారిల దంపతుల కుమార్తె బేబీ సుబ్బలక్ష్మి (వయస్సు 23 రోజులు)కి తల్లి కవిత బేబీకి స్నానం చెయిస్తుండగా బేబీ వాటర్ మింగడంతో శ్వాస ఆగిపోయింది. విషయాన్ని గ్రామ ఏఎన్ఎం తిరుమల ఆశ వర్కర సుగుణలు 108 అంబులెన్స్ వారికి సమాచారం అందించారు.
108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరీక్షించగా బేబీ గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే మెడికల్ టెక్నీషియన్ అశోక్ ఆ బేబీకి సిపి ఆర్ చేయగా బేబీ స్పృహలోనికి రావడం జరిగింది తిరిగి గుండె కొట్టుకోవడం జరిగింది. వెంటనే డాక్టర్ చక్రవర్తి గారు చెప్పిన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. బేబీ ప్రాణాలు కాపాడిన మెడికల్ టెక్నీషియన్ అశోక్, పైలెట్ వెంకట్, సిబ్బంది శ్రీకాంత్ లను బేబీ బంధువులు , హాస్పిటల్ సిబ్బంది అభినందించారు.