మాన్నురు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్ చొప్పదండి.
మున్నురు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తహసీల్దార్ కు మున్నూరు కాపు సంఘం నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ మున్నూరు కాపుల సంక్షేమం కోసం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించాలి, మరియు ఇతర భూమి స్థలానికి రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని అన్నారు.
కొండా మురళి కుక్కలాగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
భవనానికి కోకాపేటలో మున్నూరు కాపులకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయల నిధులు ఏ విధంగా సరిపోడం లేదనీ జనాభా నిష్పత్తి ప్రకారం దాని రెట్టింపు చేయాలని, పలు మున్నూరు కాపుల సమస్యలు సంక్షేమం పైన గంగాధర మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ మడ్లపెళ్లి శ్రీనివాస్,గంగాధర సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్,దొడ్ల ఎల్లారెడ్డి,రుద్రాక్ష శ్రీనివాస్,కట్ల శ్రీనివాస్,నలువాల సతన్న,ఆకుల మనోహర్,ప్రశాంత్, పలువురు మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.