టీటీడీ ప్రారంభించిన కల్యాణమస్తు పథకం ప్రారంభించిన కొద్ది రోజులకే అటకెక్కింది. నిరుపేద కుటుంబాల్లో పెళ్లి భారం కాకూడదని సదుద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమం తలపెట్టాలని భావించారు. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషంలో విరమించుకోవడంతో భక్తులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురవుతున్నారు. యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మే 31 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు.
నిరుపేదలకు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటే, దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని కలలుకన్న అనేకమంది జంటలకు టీడీడీ తీసుకున్న నిర్ణయంతో షాక్‌కు గురవుతున్నారు. నిరుపేద వధూవరులకు బంగారు తాళిబొట్టు ఇచ్చి వివాహం జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని 2007లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది.
ఆ తర్వాత ఈ వివాహ ఉత్సవ కార్యక్రమాన్ని ఆరుసార్లు నిర్వహించారు. ప్రస్తుతం పక్కన పెట్టేయడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంటలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ధర్మకర్తల మండలిలో చర్చించి కల్యాణమస్తును పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఒక గ్రాం బంగారు మంగళ సూత్రంతో పాటు వెండి మెట్టెలు, వధూవరులతోపాటు వచ్చే 20 మందికి భోజనాలు, ఇతర ఖర్చులన్నీ కలిపి జంటకు రూ.32,232 వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని 2020 నవంబరులో తీర్మానించారు. మరలా 2021 ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో చర్చించి ఒక్కో జంటకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలు అందించేందుకు టీడీడీ వద్దనున్న 20 వేల మంగళసూత్రాలను వినియోగించుకునేందుకు ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు ఏడో తేదీన సామూహిక వివాహాలు జరపాలని నిర్ణయించారు.
ఆన్ లైన్ లో చిట్స్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్.
ముహూర్త పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు.అర్హులైన వధూవరులు తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు పత్రాలను పెద్ద ఎత్తున సమర్పించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులు కల్యాణమస్తు ఊసే మరిచారు. యువ జంటల ఆశలు అడియాశలయ్యాయి. వస్తున్న వినతుల దృష్ట్యా అయినా తిరిగి కార్యక్రమాన్ని ప్రారంభించాలని దరఖాస్తు చేసుకున్నవారు కోరుతున్నారు