నెల్లూరు ఇందుకూరుపేట మండలంలో ముదివర్తి పాలెం గ్రామంలో దారుణo జరిగింది. యానాదుల కులానికి చెందిన వివాహితను అదే గ్రామంలో చర్చిలో పాస్టర్ ఇంటికి పని మీద పిలిచి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు నమోదయింది. బాధితురాలు ఇందుకూరు పెట పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. నెల్లూరు టౌన్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు విచారణ చేస్తున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నెల్లూరు రూరల్ డిఎస్పి మాట్లడుతూ వివాహితను ఇంటిలోకి పిలిచి అత్యాచారం చేయబోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చర్చిలో ఉన్న పాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు.