Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కలకలం రేపుతున్న ఐటీ దాడులు.

0

తెలంగాణ బీఆర్ఎస్ కీలక నేతల నివాసాలు, కార్యాలయాలపై ఇన్ కంట్యాక్స్ దాడులు కలకలం రేపాయి. వరుసగా ముగ్గురు కీలక నేతల ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో  ఐటీ దాడులతో ఒక్క సారిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇటీవలి కాలంలో  రాష్ట్రంలో ఐటీ దాడుల సంఖ్య తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కొంత కాలం కిందట బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా జరిగిన దాడుల తీవ్రత  పూర్తిగా తగ్గిపోవడం వెనుక బీజేపీ  కేసీఆర్ కూడా విమర్శలు బంద్ చేయడమే కారణమన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఒకే సారి ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది.

 

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలలో  దాదాపు 50 ఐటీ బృందాలు సోదాలు చేపట్టారు. వీరి  నగదు లావాదేవీలపైన ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ  ముగ్గురూ   బీఆర్ఎస్ కి చెందిన నగదును తమ వ్యాపార సంస్థల ద్వారా సర్క్యూలేట్ చేస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డికి.. వస్త్ర, జ్యూయలరీ వ్యాపారాలు ఉన్నాయి.  కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం నియోజకవర్గం గజ్వేల్ ను చూసుకుంటున్నారు. సీఎం తరపున ఆయనే అన్నీ చక్క బెడుతూ ఉంటారు.

 

పైళ్ల శేఖర్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు కంపెనీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురి నివాసాలు కార్యాలయాలపై ఐటీ దాడులు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి.  రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలు నజర్ ఇటీవలి కాలంలో  బీజేపీతో ఆ పార్టీ  ఒక అవగాహనకు వచ్చిందన్న ప్రచారం ఇటీవలి కాలంలో  జోరుగా సాగుతుండటం అదీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కమలం  పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారింది.

అధ్యక్షా.. ఎందుకీ మౌనం..

ఒక వైపు కేసీఆర్ మోడీ, బీజేపీ లక్ష్యంగా విమర్శలకు చుక్క పెట్టేయడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె కవితపై దర్యాప్తు  సంస్థల విచారణ వేగం మందగించడంతో బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక గూటి పక్షులే అన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పుడు ఐటీ అధికారులు ముగ్గురు బీఆర్ఎస్ నేతల నివాసాలూ , కార్యాలయాల్లో  సోదాలు  నిర్వహిస్తుండటం, ఆ సోదాలు  చేస్తున్న ఐటీ అధికారులు కేంద్ర బలగాలను భద్రతగా  తెచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 

పైగా ఈ సోదాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సరిగ్గా  ఒక్క రోజు ముందు జరగడం ఆ ప్రాధాన్యతను మరింత పెంచింది.కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో  బుసోదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయన కార్యాలయాలలో కూడా  సోదాలు జరుగుతున్నాయి. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు నగరంలోని వివిధ రియలెస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie