సృష్టిలో తల్లిప్రేమకు మించిన ప్రేమ లేదు. ఇది ప్రతి జీవికి వర్తించే సత్యం. దీనికి నిలువెత్తు సాక్ష్యం నిర్మల్ లో కనిపించింది. పట్టణం మీదుగా వెళుతున్న 62వ జాతీయ రహదారిపై ఆకలితో తన లేగ దూడ చేసిన అరుపు విన్న ఆవు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది.
వందలాది వాహనాలు ఇరువైపులా వెళుతున్నా రోడ్డు మధ్యలోనే తన దూడకు పాలిస్తూ నిలబడింది. రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా పాలిచ్చి దూడ ఆకలి తీర్చిన గోమాతను వాహన చోదకులు కూడా ఆగి దారి మళ్లించి వాహనాలు తీసుకెళ్లారు.