విజయవాడ, ఫిబ్రవరి 25:ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ దేశాధ్య క్షుడు ఇగ్నా జియో క్యాసిస్ అభినందించారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎడ్యు ఇగ్నా జియో కేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారుఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠ శాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠ శాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయ న్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం అభినందనీయం అన్నారు.ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా రాణిస్తారన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రత్యే్క దృష్టి ఉన్నవారికే ఇలాంటివి సాధ్యం అవుతాయన్నారు. ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన ఏపీ ప్రభుత్వ పథకాల స్టాల్ అందరినీ ఆకట్టుకుంది.
ఏపీ విద్యావిధానంపై ఆ దేశ అధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ ప్రశంసలు కురిపించడంతో స్విట్జర్లాండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా డన్జీ స్టాల్ సందర్శించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ట్యాబ్ పంపిణీ చేయడం, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అంశాలను స్టాల్స్ లో ఏర్పాటుచేశారు. ఏపీ స్టాల్ ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరల్స్ ఎడ్యుకేషన్ విధానంలో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమతి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు.