Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గ్రామ పంచాయితీ సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి

The demands of Gram Panchayat staff should be resolved

0

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

గ్రామాలలో ఏ చిన్న పని జరుగాలన్నా పంచాయితీ సిబ్బంది కీలకం అని అలాంటి వారే నేడు శ్రమ దోపిడీకి గురవుతున్నారని పిసిసి మెంబర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు.

పిఆర్సి లో నిర్ణయించిన విధంగా మినిమం బేసిక్ వేతనాలు కూడా చెల్లించకుండా గ్రామ పంచాయితీలలో అన్ని పనులు చేపించుకోవడం ముమ్మాటికీ శ్రమ దోపిడీయే అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ మైన డిమాండ్ లు పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూర అంజిరెడ్డి, కాశిపాక శంకర్,పడెళ్ళి సంపత్,మహేష్, లక్ష్మి, పోశమ్మ,రాజయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండి చాంద్,మంద మహేష్, మామిడి సత్యనారాయణ రెడ్డి, షేక్ శేహెన్ష, కమల్, తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie