Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మణిపూర్ దోషులకు కఠినంగా శిక్షించాలి

The culprits of Manipur should be punished severely

0

మణిపూర్ లో జరిగిన సంఘటనను నిరసిస్తూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బేతేస్తు చర్చి ఫాదర్ అశోక్ అధ్వర్యంలో క్రైస్తవ సోదరులు కొవ్వొత్తుల తో నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా ఫాస్టర్ అశోక్ మాట్లాడుతూ మణిపూర్ లో యావత్ సమాజం సిగ్గుపడేలా ముగ్గురు మహిళలను అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు దేశ ప్రధాని మోడి స్పందిచలపోవడం, దోషులను శిక్షించకపోవడం చాలా బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు.

మణిపూర్ లో హింసలు చెలరేగుతున్నా ప్రధాని పట్టించుకోకపోవడం తో హింసా ఖండాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దుండగుల పై ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై, ఈ హింసాఖాoడలకు కారణం ప్రధానే కారణమని పలు అనుమాలను వ్యక్తమవుతున్నాయనీ అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడి స్పందించి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie