Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

18 మంది ఎమ్మెల్యేలు ఎవరు.

0

ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది ఇక తొమ్మిదినెలలే సమయం ఉంది. మరోసారి టార్గెట్‌ గుర్తు చేసి మరీ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. 175 సీట్లు గెలవాల్సిందే అంటున్న సీఎం 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌ వరకూ గడువు ఇచ్చి మరీ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. బాగుంటే సరే… లేదంటే ఇంటికే అని వార్నింగ్ కూడా ఇచ్చారు. గ్రాఫ్‌ లేకపోతే మీకే కాదు పార్టీక్కూడా నష్టమే అంటూ సీరియస్‌ అయ్యారు CM.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమం అంత్యంత కీలకం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

 

మీ పనితీరు బాగోలేని పక్షంలో టిక్కెట్లు ఇవ్వను.. చివరిలో మీరు నన్ను బాధ్యుడిని చేయవద్దని ఎమ్మెల్యేలకు జగన్ స్పష్టం చేశారు.  కొన్ని మీడియా సంస్థలు మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఇందుకు దీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని సూచించారు.  సోషల్ మీడియా ద్వారా మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు.  ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని అబద్దాలు, విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే రెండు రోజుల్లో ప్రారంభం కానున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు.

 

ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు వెళ్లి కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. వారు అడిగిన ప్రతీ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.  జనం అడిగిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అధికారులు కూడా వాటిని పరిష్కరించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.YCP వర్క్‌షాపులో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం అన్నారు.

 

ఇది అందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమం అన్నారు. దీని ద్వారా పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని, గ్రాఫ్‌ బాగోలేకపోతే అలాంటి వారిని కొనసాగించడం కుదరదని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. అలాంటి వారిని కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ కూడా నష్టం వాటిల్లితుందని సీఎం జగన్‌ చెప్పారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందన్నారు. అలా జరగకపోతే.. మార్చక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పారు. సర్వేలో ఆయా ఎమ్మెల్యేల గ్రాఫ్‌ అనుకూలంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు.కొన్నికోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

కొత్త డీజీపీ ఎవరు..

గడగడపకు సర్వే ఆధారంగా కోట్ల మంది పేదవాళ్లకు మంచి జరుగుతుందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేకపోతే… కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ కూడా నష్టమే అన్నారు. అంతేకాదు..కోట్లమంది పేదలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికోసం గడపగడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండడానికి గడగడపకు బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరగుతుంది. ఇంతకుముందున్నా.. బ్రహ్మాండమైన మెజార్టీలు తిరిగి మనకే రావాలన్నారు సీఎం జగన్‌.

 

అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.తీవ్రమైన ఎండల వల్ల కొన్ని ఇబ్బందులున్నాయన్న విషయం వాస్తవే అన్నారు సీఎం జగన్‌. ఇకమీదట గడపగడపకూ కార్యక్రమం ముమ్మరం కావాలన్నారు. సర్వేలు అనుకూలంగా లేకపోతే, టిక్కెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దని సూచించారు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలని, గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలన్నారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకంకానున్నాయని చెప్పారు. మనం ఖచ్చితంగా గెలవాలి.. 175కి 175 సీట్లు రావాలంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie