2024 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన జోష్‌తో తెలంగాణలోనూ సత్తా చాటాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ కర్నాటక ప్లాన్ అమలు చేయాలని టీ.కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. 3 నెలల ముందే 60శాతం సీట్లు ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీ టూర్‌తో తెరపైకి కీలకాంశాలు వచ్చాయి. తెలంగాణపై ఫోకస్ పెంచాలని కోమటిరెడ్డి కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే 3 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు కవర్ అయ్యేలా ప్రియాంక టూర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నింపేలా అగ్రనేతలు పర్యటనలు చేపడుతున్నారు. పాదయాత్రలు, పర్యటనలకు సిద్ధమవుతున్నారు. బెంగళూరు కేంద్రంగా రేవంత్‌రెడ్డి రాజకీయ మంత్రాంగం రచిస్తున్నారు. ఇప్పటికే భట్టివిక్రమార్క పాదయాత్రతో నేతల్లో జోష్ నింపుతున్నారు. కర్నాటక విజయం తర్వాత బీఆర్‌ఎస్ కూడా ఫోకస్‌ను కాంగ్రెస్ వైపు మళ్లించినట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్ లో తగ్గిన రియల్ జోరు.
టీకాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నట్లు పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.కర్నాటక వ్యూహాన్ని తెలంగాణ అమలు చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక లాగానే మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం 60శాతం సీట్లు ముందే ప్రకటించేలా వ్యూహరచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తాయా.? కర్నాటకలో వర్కవుట్ అయిన ప్రయోగం తెలంగాణలో సక్సెస్ అవుతుందో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి