శనివారం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్కు వచ్చిన మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ప్రభావం చూపలేదన్నారు. మత రాజకీయాలు కర్ణాటకలో పనిచేయవన్నారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారని, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని సిద్ధరామయ్య అన్నారు. . ముఖ్యమంత్రి పదవి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఆ పదవి ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో ముందు జాగ్రత్తగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ వెంటనే బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.