విశాఖపట్నంలో బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఓ స్వామీజీని అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపు తోంది. తనపై లైంగిక దాడికి ప్రయ త్నించినట్లు బాధిత బాలిక ఫిర్యాదు చేయగా.. తనపై కుట్ర జరుగుతోందని పూర్ణానంద స్వామీ వాపోయారు. విశా ఖపట్నం జిల్లా వెంకోజి పాలెంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ లీలలు బయటికి వచ్చాయి. ఆశ్రమంలో బాలికపై కీచక స్వామి లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధిత బాలిక తెలిపిన వివరాల మేరకు.. చిన్నప్పుడే తల్లి దండ్రులను కోల్పోయిన బాలిక, 12 ఏళ్ల వయసులోనే ఆశ్రమంలో చేరింది. అయితే, తనపై స్వామీజీ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాలిక ఆరోపిస్తోం ది. ఈ క్రమంలోనే స్వామీజీ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. విజయవాడ సీడబ్ల్యూసీకి చేరింది. అక్కడి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలో జ్ఞానానంద ఆశ్రమ నిర్వా హకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆశ్రమంలో వేధింపు లకు గురి చేశారని మైనర్ బాలిక అమరావతిలో చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.