మంగళవారం ఉదయం అవనిగడ్డ లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా అవనిగడ్డకు చేరుకున్నారు. సోమవారం ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద Sand quarry ఇసుక క్వారీలలో TDP satyagraha టీడీపీ సత్యాగ్రహాన్ని ఘంటసాల ఎస్ ఐ శ్రీనివాస్ అడ్డుకున్న విషయం తెలిసిందే. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఘంటసాల ఎస్ ఐ శ్రీనివాస్ ప్రవర్తనకు నిరసన తెలిసారు. మంగళవారం ఘంటసాల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. బుద్ధప్రసాద్ దీక్ష నేపథ్యంలో అవనిగడ్డ, ఘంటసాల లలో పోలీసులు భారీగా మోహరించారు.