తెలంగాణలో ఎన్నికల నగారా మరికొన్ని నెలల్లో మోగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు పొలిటికల్ యాక్టివిటీస్‌ని ఓ రేంజ్‌లో పెంచేశాయి. రెండు సార్లు అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట రంగంలోకి దిగింది. అయితే కేసీఆర్ మాత్రం రెండు దఫాలుగా సెంటిమెంట్‌నే ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు.తొలి దఫాలో తెలంగాణ సెంటిమెంట్ వర్క్ అవుట్ చేశారు. మన రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో రావాలని పొలిటికల్ స్పీచ్‌ల్లో చెప్పుకుంటూ వచ్చారు. రిజల్ట్స్ సైతం కలిసొచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సీఎం పీఠంపై కేసీఆర్ కూర్చున్నారు.
రెండో దఫాలో చంద్రబాబు, కాంగ్రెస్‌తో కలవడంతో మళ్లీ ఆంధ్ర వాళ్లు మనల్ని పరిపాలించాల్నా అంటూ సెంటిమెంట్ రాజేశారు. దీంతో 2018లో సైతం భారీ మెజార్టీలో అధికారంలోకి వచ్చారుఇటీవల జరిగిన వరుస బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్ వారికి అధికారం జరిగే పరిణామాలపై రైతులకు, ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. రెండు దఫాలుగా వర్క్ అవుట్ అయిన సెంటిమెంట్‌నే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆపాదిస్తూ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. రైతులే టార్గెట్ వారి ఓటు బ్యాంకుపై కన్నేసిన కేసీఆర్ రుణమాఫీ విషయమై ఎక్కడా ప్రస్తావన తేవడం లేదు. కానీ రైతు బంధు, రైతు బీమా పథకాలను చూపి ఎన్నికలకు వెళ్తారని క్లారిటీ ఇస్తున్నారు.
కాంగ్రెస్‌కు అధికారమిస్తే దళారుల భోజ్యం, దోపిడి రాజ్యం అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి అధికారం ఇస్తే మత కల్లోలాలు జరుగుతాయని ప్రజల్లో కొత్త ఆలోచనకు తెర లేపారు.కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీలోకి కొంత మంది కీలక నేతలు చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పొంగులేటి, జూపల్లి, తాజాగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి వంటి హస్తం పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం పొంచి ఉందన్న కేసీఆర్ గేర్ మార్చారు. బీజేపీని గతంలో ఏకి పారేసిన కేసీఆర్ ప్రస్తుతం కాంగ్రెస్ పై ఫోకస్ పెంచారు.
ఎన్నికలకు సిద్ధమంటున్న గడల శ్రీనివాస
రావు.కాంగ్రెస్, బీజేపీలకు అధికారమిస్తే ఇక జరిగేది అదే అంటూ క్లియర్ పిక్చర్ చూయిస్తున్నారు.తద్వారా అవినీతి, మత కల్లోలాలు వంటి సున్నితమైన సెంటిమెంట్‌ను వాడుకుని ఈ దఫాలో సక్సెస్ కావాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. తమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవో చెప్పాలని రెండు పార్టీల నేతలను కార్నర్ చేస్తున్నారు. తమ విధానాలు, పథకాలు కేంద్ర పభుత్వం ఆచరిస్తుంటే ఇక వారి పాలన మనకు అవసరమా అంటూ చెబుతున్నారు. తాజా సెంటిమెంట్ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఏ మేరకు ప్లస్ అవుతుంది. ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఇదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సంస్కరణలు భేష్ అని గతంలో కామెంట్ చేయడం కొసమెరుపు.