బీసీ లను నట్టేట ముంచుతున్న కేంద్రం.. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
దేశంలోని బీసీలను, వారి ప్రగతిని గాలికి వదిలివేసి అన్ని రంగాలలో ఈ వర్గాలను వెనుకకు నెట్టేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావువిమర్శించారు.దేశంలోని బీసీలు తాము ద్వితీయ శ్రేణి పౌరులమా అని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.మంగళవారం నగరంలోని ఇసిఐఎల్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్, కె.ఎం.రావు భవన్ లో అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వాతంత్య్ర దేశంలో ఓబీసీ ల స్థితి గతులపై జాతీయ సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రబీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆత్మీయ అతిథిలుగా అల్ ఇండియా ఓబీసీ ఉద్యోగుల
ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. కరుణానిధి, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు పి. శ్రీనివాస్ గౌడ్, దామోదర చారి, చిన్నయ్య ముదిరాజ్, లైసనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, పి. పూర్ణ చందర్, జె. శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ జ్యోతిభాఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ఇసిఐఎల్ ఓబీసీ ఓబిసి సంఘం ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాస్ గౌడ్ మన్వయకర్తగా వ్యవహరించారుఈ సందర్భంగాముఖ్య అతిథిడాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ.. మోడీ 10 ఏళ్ళ పాలనలోఓబీసీలు 20 ఏళ్ళు వెనకకు నెట్టి వేయబడ్డారుఅన్నారు. కులగణన చేపట్టబోము అనిచెప్పడం, బ్యాక్ లాగ్ విధానాన్ని అమలు చేయక పోవడం, ఓబీసీ లకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సన్నద్ధం కాకపోవడం, నాన్ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని పెంచబోమనిచెప్పడం బీసీవర్గాలపై వ్యతిరేక
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన
చర్యలు కాకపోతే మరేమవుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.ఉద్యోగులంతా హక్కుల సాధనకు సంఘటితంగా పోరుబాటు పట్టాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.జి. కరుణానిధి ప్రసంగిస్తూ..బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ పేరిట కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉద్యోగాల కల్పనకు కేంద్రం గండి కొడుతుందని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో ఇసిఐఎల్ ఓబీసీ ఉద్యోగులు, నగరంలోని వివిధపబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన ఉద్యోగులు పెద్దగా పాల్గొన్నారు.