నోటిఫికేషన్ల విడుదలతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ హామీలతో యువత ఓట్ బ్యాంకు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. బీజేపీకి కూడా యువత లక్ష్యంగా ప్రణాళికలు చేస్తుంది.
అంబేద్కర్ విగ్రహం వద్ద.. ట్యాంక్ బండ్‌పై 750 డ్రోన్‌లతో భారీ డ్రోన్ షో..
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలో బీఆర్ఎస్.. ఆ హామీలు విస్మరించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరుతో యువతలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తుంది.టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని విమర్శలు వచ్చాయి. పేపర్ల లీకేజీతో చాలా పరీక్షలు రద్దయ్యాయి. యువతను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ లికేజీతో యువతలో గందరగోళం నెలకొంది. తెలంగాణలో 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించి పలు నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడ్డాయి. పేపర్ల లికేజీతో ఈ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యంగా కొనసాగుతుంది. హైదరాబాద్ యువతకు ఉద్యోగాల కల్పనలో కీలకంగా మారింది. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తు్న్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుందిఈ తరుణంలో కాంగ్రెస్ కూడా యువత లక్ష్యంగా హామీలు ఇస్తుంది. యువత కోసం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సభలో ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ ఆసక్తిగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేసి తీరుతామని ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సభలో తెలిపారు. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా..తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
హూస్సేన్ సాగర్ ఒడ్డున అమర దీపం.
దీంతో పాటుగా తల్లి, తండ్రి లేదా భార్యకు రూ 25 వేల అమర వీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయటంతో పాటుగా జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందిస్తామని యూత్ డిక్లరేషన్ లో వెల్లడించారు. దీంతో పాటుగా పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి..సెప్టెంబర్ 17 లోగా నియామకాల పూర్తి చేస్తామని స్పష్టంగా పార్టీ ప్రకటించింది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ..ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లింపు పైన హామీ ఇచ్చారు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్పీ తరహాలో పునరుద్దరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.మరోవైపు బీజేపీ కూడా యువత ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని అంటోంది. ప్రతి సంవత్సరం ఉద్యోగాల ఖాళీల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేపడతామని తెలిపింది.తెలంగాణలో ప్రధాన పార్టీలు యువతే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే యువత ఎవరి డిక్లరేషన్ మెచ్చి ఓట్లు కురిపిస్తారో… వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.