తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఎత్తులు, పై ఎత్తులతో ఢిల్లీ కేంద్రంగా పార్టీలన్నీ చక్రం తిప్పుతున్నాయి. డీ యాక్టివ్ అయిన తెలంగాణ నేతలను రీఛార్జ్ చేయడానికి బీజేపీ అధిష్టానం రంగంలో దిగింది. అటు చేరికలు, విలీనాలపై కాంగ్రెస్ కూడా స్పీడు పెంచుతోంది. పథకాలతో దూకుడు పెంచిన బీఆర్‌ఎస్ కూడా జాతీయస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ పెంచుతూ కేటీఆర్‌ను రంగంలో దింపిందిగులాబీ బాస్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాల ఊహకందని రీతిలో.. పక్కా ప్లాన్‌తో.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. అన్నిపార్టీల కంటే ముందుగానే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున.. ముందుగానే అభ్యర్థుల జాబితాను రెడీ చేశారు. వారం, పది రోజుల్లోనే.. మొత్తం అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ప్రభుత్వ రద్దు ప్రకటనతో పాటే.. అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. అప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందే.. ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది.తరహాలో.. ఇప్పుడు కూడా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్ కసరత్తు చేశారు.
వారం, పది రోజుల్లోనే.. అందరు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా వారం, పదిరోజుల్లో.. మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు గులాబీ బాస్. ఇంకా ఈ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండానే.. సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. అలానే.. 80 నుంచి 90 శాతం సిట్టింగ్స్‌కే అవకాశం కల్పిస్తున్నారు. ఇక 8 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్ ఉంది. సర్వేల ఆధారంగా గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.కాగా, ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనుక.. గులాబీ బాస్ పెద్ద ప్లానే ఉందట..!
వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్‌ఎస్‌లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్ దక్కుతుందని ఇప్పటికే స్పష్టత నిచ్చారు. చివరి నిమిషంలో టిక్కెట్లు ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం చూపిస్తుంది. ఎన్నికల ముందు.. టికెట్ దక్కని వారు తిరుగుబాటు చేసి రెబల్స్‌గా మారి వేరే పార్టీల్లో చేరిపోవడం, అంతర్గత విబేధాలు లాంటివి సర్వసాధారణమే. అయితే.. ఈసారి ఇలాంటివాటికి చోటివ్వకుండా ఉండేందుకే.. కేసీఆర్.. ముందుగానే వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారట. బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితా సిద్ధంగా ఉందని.. వారిని వీలైనంత వరకూ బుజ్జగించడానికి.. లేకపోతే.. వెళ్లిపోయినా ప్రభావం లేకుండా చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు