Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి.. ఈటల జమున..

0

తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతో అయినా కెసిఆర్ ను ఓడించడం సాధ్యమే.ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా  సంతృప్తిగా ఉన్నారు.  ఆయన ప్రజలకోసం పనిచేస్తారని ఈటల భార్య ఈటల జమునల అన్నారు. మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. మేం ఎప్పుడు పదవుల కోసం ప్రాకులాడ లేదు.  కాళ్ళు మొక్కుడు మా రక్తంలో లేదు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. పరోక్షంగా ఉండి.. ఈటల రాజేందర్ కు అండగా ఉంటా.  ఈటల రాజేందర్.. ప్రతిష్ఠ దిగజారింది, మెప్పు కోసం మాట్లాడబోతున్నారు అని వాట్స్ అప్ లో డుతున్నారు. కానీ ఈటల ప్రతిష్ఠ ఎప్పుడు దిగజారదు. ఈటల ఉద్యమ కారుడు. ప్రజలు మమ్ముల్ని కాపాడుకుంటారు.

 

లంగ,దొంగ పనులు చెయ్యలేదు.  చిల్లర గాల్లు ఎన్నికల సమయంలో ఈటల కాళ్ళకు కట్టు కట్టుకుంటారు. జమున కొంగు పట్టుకొని అడుగుతారు అన్నారు.  మేము అలాంటి పనులు చేసే వాళ్లం కాదు.  టజల్లో ఉన్నాం ప్రజల మెప్పు పొందాము.  చిల్లర, పిచ్చి కుక్కను ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ మీదకు కెసిఆర్ వదిలిపెట్టారు. మహిళలను కించ పరుస్తారు.  అమ్మ నాన్న సంస్కారం నేర్పారు అన్నారు. మరి కెసిఆర్ ఈ పిచ్చి మాటలు నేర్పించారా ?  ఎన్ని మాట్లాడితే అన్ని ఎక్కువ పదవులు వస్తున్నాయా ? గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారా?  2014 లో కట్టిన అమరవీరుల స్థూపంను ఆయన పేరు లేదు అని కూల్చి వేశారు.. అమరవీరుల స్తూపం తాకే అర్హత లేదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.

 

మా మీద అక్కస్సుతో ఇదంతా కెసిఆర్ చేయిస్తున్నారు.  కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా గా ఉండే నైతికత లేదు. కెసిఆర్ ఆయన్ను వెంటనే భర్తరఫ్ చెయ్యాలి.  గవర్నర్ ను తిడితే మండలించల్సింది పోయి పదవులు ఇచ్చారు.  చెల్పుర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ ను అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి.. పోలీసులతో కొట్టించారు.. దాన్ని వీడియో కాల్ చేసి మరి చూయించాలని ని ఒత్తిడి చేసిన రాక్షసుడు.  మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  పంచాయితీ సెక్రటరీనీ యూజ్ లెస్ ఫెల్లో అని తిట్టారు.   రైతును సిగ్గు లేదా అని తిట్టారు.  రైస్ మిల్లులు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు .  20 కోట్లు పెట్టీ ఈటల రాజేందర్ ను చంపేస్తా అని  కౌశిక్ రెడ్డి చెప్తున్నారు అంటే అది కెసిఆర్ అండతోనే. నీతో చంపించడానికేన మేము ఉద్యమం చేసింది.

కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేప‌ట్టాలి.. కొత్త ఉద‌యం దిశ‌గా.. క్రాంతి మార్గంలో దేశం న‌డ‌వాలి

చెప్పకుంటే వినకపోతే చంపడానికి కూడా కెసిఆర్ రెఢీ అవుతున్నారని అనుకోవాలా ?  ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారు.  మా మొత్తం  దుర్మార్గులను ఎదురిస్తున్న అన్నందుకు సంతోషంగా ఉన్నాం.  చిన్న కులాల వారు అనా చిన్న చూపు.. ఎవరి మాట్లాడిన మహిళలు క్షమించరు చెప్పుల దండ వేస్తారు. ఊర్లో తిరగనివ్వరు.  శాడిస్ట్ లకు పోలీసులు మద్దతు ఇవ్వకండి. పిచ్చికుక్క అని హుజూరాబాద్ ప్రజలు అందరు అనుకుంటున్నారు.  తిట్టి కొట్టి ఇప్పుడు మళ్లీ ఫేక్ అంటున్నారు.  క్షమాపణ చెప్పమని అంటే చెప్పకపోతే ఎలా ?  ప్రజలారా కళ్ళు తెరవండి. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకు రక్షణ ఉండదు.  ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మహిళలందరం కలిసి ఇంటికి పంపిద్దాం.  కెసిఆర్  మా ఇంట్లో.. నా భర్త, పిల్లలు ఎవరు రక్తం బొట్టు పడినా మీదే బాధ్యత. అనిఅమె ఆన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie