ఏపీపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏమన్నానని ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. మీ దగ్గర ఏమున్నదని అంటున్నారు. మా దగ్గర ఏమున్నాయో దునియా చెబుతాం. మా దగ్గర 56 లక్షల ఎకరాల సాగుభూమి, రైతు బీమా, రైతు బంధు ఉందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించామన్నారు. ఏపీలో ఏమున్నాయో చెప్పగలరా? నాడు ప్రత్యేక హోదా కావాలన్నారు. నేడు అడగడంలేదన్నారు.
వైసీపీ, టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి. ప్రత్యేక హోదా కేంద్రం ఎగ్గొట్టినా మాట్లాడటంలేదు. మా జోలికి రావద్దు. ఎక్కువ మాట్లాడొద్దు.