Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తొమ్మిదేళైనా.. ఇంకా అద ముచ్చట..

0

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విద్యుత్‌ కోతలపై కామెంట్ చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ ప్రసంగాల్లో తరచూ ఆంధ్రా ప్రస్తావన చేస్తున్నారు. తాజాగా గద్వాలలో కూడా ఏపీలో విద్యుత్‌ కోతలంటూ ఎద్దేవా చేశారు. “ఉద్యమ సమయంలో విడిపోతాం అంటే కరెంటు పోతుందన్నారు. తెలంగాణ చీకటి అవుతుందని మాట్లాడారు. జోగులాంబ గద్వాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రా ప్రాంతం ఉంది. తుంగభద్ర వంతెనుకు ఇవతల 24 గంటలు కరెంటు ఉంటుంది. అవతల ఏపీలో ఉండదు..” అని విమర్శించారు.

 

ఇది అందరూ చూస్తున్నారని, దేశంలో తెలంగాణ మాదిరి కరెంటు ఎక్కడా ఇవ్వడం లేదని సోమవారం గద్వాలలో వ్యాఖ్యానించారు.అభివృద్ది, విద్యుత్ విషయంలో తెలంగాణను ఆంధ్రాతో పోల్చడం మొదటి సారి కాకపోయినా ఇటీవల కేసీఆర్ నోటి వెంట తరచూ ఈ తరహా మాటలు వస్తున్నాయి. కేసీఆర్‌తో పాటు హరీష్‌ రావు కూడా పదేపదే ఆంధ్రప్రదేశ్‌‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కారణం ఏమిటనే చర్చ రెండు ప్రాంతాల్లోను సాగుతోంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అకాంక్షను రగిలించడం మొదలుకుని, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరిలో ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక రాజేయడంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని మళ్లీ ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

బండి సంజయ్ – కవిత ట్విటర్ వార్, అసలు ఎవరూ తగ్గట్లేదుగా!

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు సమీపిస్తున్నాయి. పదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పదేళ్లలో కనీవిని ఎరుగని స్థాయిలో అభివృద్ధిని సాధించామని కేసీఆర్ చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌‌ను టార్గెట్‌ చేసేలా విమర్శలు గుప్పిస్తున్నారు. 2015లో ముఖ్యమంత్రి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని వదులుకుని హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు. మరికొద్ది నెలల్లో ఉమ్మడి రాజధాని నిబంధన గడువు కూడా ముగిసిపోతుంది.కేసీఆర్‌ పదేపదే ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన చేయడం వెనుక పెద్దగా రహస్యం ఏమి లేదు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ పాత విషయాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకాన్ని తన వెంట ఉంచుకోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్ల ఓట్లన్ని గంపగుత్తగా బిఆర్‌ఎస్‌ పార్టీకి పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

 

సామాజిక సమీకరణలు, కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఏపీని విమర్శించడం ద్వారా అక్కడ ఏమి లేదని, తెలంగాణలోనే అభివృద్ది మెరుగ్గా ఉందనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 10లక్షల సెటిలర్లను బిఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ పదేపదే విమర్శిస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి.హరీష్ రావు విమర్శించినా

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ట్రాన్సఫర్ కు ఓకే.

కేసీఆర్ తప్పు పట్టినా పాత విషయాలను పదేపదే గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసి, ఆంధ్ర వెనుకబడిందని విమర్శించడం ద్వారా తెలంగాణలో సెంటిమెంట్‌ ఉపయోగించుకునే ప్రయత్నాల్లో భాగమేనన్నది స్పష్టమవుతోంది. కేసీఆర్ వైపు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులు ఎవరు పెద్దగా దానిపై మాట్లాడటం లేదు. కేసీఆర్, హరీష్‌ కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా వారికి లబ్ది చేకూర్చడం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే ఏపీ నేతల్ని మాట్లాడొద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie