Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేప‌ట్టాలి.. కొత్త ఉద‌యం దిశ‌గా.. క్రాంతి మార్గంలో దేశం న‌డ‌వాలి

0

మ‌హారాష్ట్ర‌లోని స‌ర్కోలిలో జ‌రిగిన స‌భ‌లో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఈ దేశానికి ల‌క్ష్యం ఏమైనా ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. లేకుంటే ఊరికే ఉన్నామా అని అడిగారు. మేం ఎవ‌రి టీమ్ కాదు.. మాది కిసాన్ టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు.  ఇదే స‌రైన‌ స‌మ‌యం అని, ల‌క్ష్యం గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కొత్తగా స్వాతంత్య్ర పోరాటం చేప‌ట్టాల‌ని, కొత్త ఉద‌యం దిశ‌గా.. క్రాంతి మార్గంలో దేశం న‌డ‌వాల‌న్నారు. సౌత్ కొరియా, జ‌పాన్, సింగ‌పూర్ మ‌లేషియా, లాంటి చిన్న దేశాలు ఎంతో ప్ర‌గ‌తి సాధించిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.  చైనా.. ఓ ద‌శ‌లో పేద దేశమ‌ని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందా తెలుసా అని ప్ర‌శ్నించారు.

 

మ‌నం ఎక్క‌డ ఉన్నామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి.. కాంగ్రెస్‌, శివ‌సేన‌, బీజేపీల‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారని, చేయాల‌నుకుంటే ఎవ‌రైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏమీ చేయ‌లేక‌పోయిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.రైతుల మంచి కోసం ఏదైనా చేయ‌వ‌చ్చు అన్నారు మ‌హారాష్ట్ర పెద్ద రాష్ట్రం.. ధ‌న‌వంత‌మైన రాష్ట్రం అన్నారు. మ‌హా నేత‌లు దివాళా తీస్తారని.. కిసాన్ల‌కు దివాళీ వ‌స్తుందన్నారు. త‌న‌కు మ‌రాఠీ రాదు అని, కానీ అన్నీ అర్థం చేసుకోగ‌ల‌న‌న్నారు.  భార‌త్ ప‌రివ‌ర్త‌న్ మిస‌న్ న‌డుస్తోంద‌న్నారు.

 

పండ‌రీ ద‌ర్శ‌నం కోసం వ‌స్తే.. ద‌ర్శ‌నం చేసుకోండి.. కానీ రాజ‌కీయం చేయ‌కండి అన్నారని కొంద‌రు నేత‌లు అన్న‌ట్లు సీఎం తెలిపారు.  పండ‌రీ పుణ్య స్థ‌లం అని.. అక్క‌డ ఏమీ చెప్ప‌లేదు.. కానీ ఇక్క‌డ అన‌కుండా ఉండ‌లేన‌న్నారు. మ‌హా నేత‌లు ఎందుకు ఆక్రోశానికి లోన‌వుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మేం ఎవ‌రి టీమ్ కాదు.. కిసాన్ టీమ్ మాది.. అల్ప‌సంఖ్యాకుల టీమ్ అని సీఎం కేసీఆర్ అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్‌.. భాల్కే అన్నార‌ని గుర్తు చేశారు.తెలంగాణ‌, మ‌హారాష్ట్ర కోసం ఏర్ప‌డిన పార్టీ త‌మ‌ది కాద‌న్నారు. దేశంలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నింటికీ.. ప‌రివ‌ర్త భార‌త్ కావాల‌న్నారు.

 

కోట్లాది ఎక‌రాల సాగు భూమికి నీరును అందిస్తామ‌న్నారు. ఔరంగ‌బాద్‌లో 8 రోజుల‌కు ఒక‌సారి నీళ్లు వ‌స్తాయ‌న్నారు. సోలాపూర్‌లో 5 రోజుల‌కు ఒక‌సారి వ‌స్తాయ‌న్నారు. అకోలాలో కూడా నీళ్లు రావ‌డం లేద‌న్నారు. కేంద్ర జ‌ల‌విధానాన్ని బంగాళాఖాతంలో వేయాల‌న్నారు. జ‌ల‌నీతిని మార్చేస్తామ‌న్నారు. న‌యా భార‌త్‌ను రూపొందిస్తామ‌న్నారు. దేశంలో నీళ్లు లేవంటే అది మ‌రో మాట అవుతుంద‌ని, కానీ నేత‌ల మాయ‌మాట‌లు చెప్పి నీళ్లు ఇవ్వ‌లేక‌పోయిన‌ట్లు ఆరోపించారు.బొగ్గు విద్యుత్తు, సోలార్ ప‌వ‌ర్‌, హైడ్రో ప‌వ‌ర్‌, థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ మాత్రం దేశంలో ఎటువంటి స‌మ‌స్య లేద‌న్నారు. ఆ బొగ్గు రిజ‌ర్వులు బిలియ‌న్ల ట‌న్నుల్లో ఉన్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

బైపాస్ రోడ్డు కల సాకారం చేయండి -అర్బన్ మండలం కోరుతూ సంతకాల సేకరణ..

కావాల్సినంత బొగ్గు నిల్వ‌లు ఉన్న‌ప్పుడు.. విద్యుత్తు స‌మ‌స్య ఎందుకు వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. హైడ్రో, సోలార్‌, బొగ్గును స‌మ‌తుల్యం చేస్తే, అప్పుడు దేశ‌వ్యాప్తంగా విద్యుత్తు స‌మ‌స్య ఉండ‌ద‌న్నారు. 125 ఏళ్ల‌కు కావాల్సినంత బొగ్గు మ‌న ద‌గ్గ‌ర ఉంద‌న్నారు. రైతుల కోసం 24 గంట‌ల పాటు ఉచిత విద్యుత్తును తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు ఒక్క‌టి కాకుంటే, మార్పు ఉండ‌ద‌న్నారు. రైతులు బ్ర‌తికి ఉంటే ఎవ‌రు జీవిస్తారు.. రైతులు మ‌ర‌ణిస్తే ఎవ‌రు బ్ర‌తుకు తార‌ని ఆయ‌న అన్నారు. దివ్యాంగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పెన్ష‌న్ 4వేలు ఇస్తోంద‌న్నారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ స‌ర్కార్ వ‌స్తే.. అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామ‌న్నారు.

 

వృద్ధుల‌కు పెన్ష‌న్ ఇస్తామ‌న్నారు.అమెరికాలో న‌ల్ల‌జాతి వారిని ఎంతో వేధించార‌ని, కానీ బ‌రాక్ ఒబామాను గెలిపించి అక్క‌డి ప్ర‌జ‌లు ఆ రుణం తీర్చుకున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. భార‌త్‌లో కూడా ఇలాంటి మార్పు రావాల‌ని, రైతు ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాల‌న్నారు. తెలంగాణ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో భూముల్ని డిజిట‌లైజ్ చేసిన‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌థ‌కాల అమ‌లు .. మ‌హారాష్ట్ర‌లో ఎందుకు జ‌ర‌గ‌వ‌ని ఆయ‌న నిలదీశారు.బీఆర్ఎస్‌లో చేరిన మ‌రాఠీ నేత భ‌గీర‌థ్ బాల్కేకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ప‌శ్చిమ మ‌హారాష్ట్ర ద‌ర్వాజ్ ఓపెన్ చేసిన బాల్కేకు అండ‌గా ఉంటామ‌న్నారు.

 

పండ‌రీపుర వికాసం మొత్తం బాల్కే చేతుల మీదుగా జ‌రుగుతుంద‌న్నారు.రైతు ఇంట్లో పుట్టాను, నేను స్వ‌యంగా రైతును, రైతు సంక్షేమం కోసం పనిచేస్తాన‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. డిజిట‌ల్ ఇండియా అని కేంద్రం చెబుతోంద‌ని, కానీ ఎందుకు భూముల్ని డిజిటైజ్ చేయ‌డం లేద‌న్నారు. మేక్ ఇన్ ఇండియా అని ప్ర‌ధాని చెబుతార‌ని, కానీ ప్ర‌తి వీధిలో చైనా బ‌జార్ ఎందుకు క‌నిపిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌శ్నించారు. దీపావ‌ళి బాంబులు, రంగుల‌న్నీ చైనా నుంచే ఎందుకు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. భార‌త‌దేశ ప‌రివ‌ర్త‌నే అన్నింటికీ ప‌రిష్కారం అన్నారు.

 

ధ‌ర‌ణి పోర్టుల్లో ఒక‌సారి రైతు డేటా ఎక్కితే, దాన్ని ఎవ‌రూ మార్చ‌లేర‌న్నారు. ఒక్క రైతు బ‌యోట్రిక్ ద్వారానే దాన్ని మార్చే వీలు ఉంద‌న్నారు. తెలంగాణ రైతుల వ‌ద్ద పాస్‌పోర్టు లాంటి సుంద‌రమైన పాస్ బుక్ ఉంటుంద‌ని అన్నారు. తాము ఎవ‌రికీ టీం కాదు అని.. త‌మ‌ది రైతుల టీమ్‌, ద‌ళిత టీమ్ అన్నారు. రైతులు తోడుంటే ఎవ‌రి అవ‌స‌రం లేద‌న్నారు. అబ్ కీ బార్ .. కిసాన్ స‌ర్కార్ అని సీఎం కేసీఆర్ నినాదాలు చేశారు. త‌మ విధానంలో న్యాయం, నీతి ఉంద‌న్నారు. మ‌రాఠీ నేత భ‌గీర‌థ్ బాల్కే ఇవాళ స‌ర్కోలీలో జ‌రిగిన స‌భ‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie