హైకోర్టు కేసులతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలలో ఆందోళన
Concern among Telangana BRS MLAs with high court cases
తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలయ్యింది. పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత కేసులు హైకోర్టులో విచారణకు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.!. వనమా వెంకటేశ్వరరావుపై వేటు వార్త ఇప్పుడు కలవరపెడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో మొత్తం 28 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఎప్పుడైనా బాంబులా పేలవచ్చు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పిటిషన్‌లన్నీ దాఖలవ్వగా.. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. అయితే ఎన్నికలు దగ్గర్లోనే ఉండటం, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు.
ఇవన్నీ చకచకా చక్కబెట్టాలని అనుకుంటున్న వేళ తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో హైకోర్టులో తీర్పు వస్తుందన్న ఆందోళన ఉంది. తనపై కేసును కొట్టేయాలని మంత్రి కొప్పుల వేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కూడా తిరస్కరించింది. అలాగే నాంపల్లి కోర్టు మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కేసుకు ఆదేశించింది. ఇలా పలువురు ఎమ్మెల్యేల వ్వయహారం పార్టీకి తలనొప్పులు తెచ్చేలా ఉంది. అయితే ఇందులో కొందరిని బలవంతంగా అయినా తప్పించే పరిస్థితి తప్పదని అంటున్నారు. హైకోర్టులో మొత్తం 30కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉండగా..అందులో 28కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం.