జనగామ: జనగామ జిల్లా పదో పరీక్షలు సోమవారం ప్రశాంతంగా షురూ అయ్యాయి. పట్టణంలోని సెంట్ మేరీస్, ఏకశిల పాఠశాలల్లోని పరీక్షల కేంద్రాలను కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ నెహ్రూ పార్క్ వద్ద ఉన్న సెయింట్ పాల్స్ స్కూల్, స్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన తరగతి పరీక్షలను పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ కె.రాము, చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు.