సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో గురువారం తీజ్ వేడుకలు వైభవంగా జరిగాయి. గిరిజనుల ఆరాధ్యదైవమైన శిత్ల పండుగ అనంతరం తొమ్మిదవ రోజున తీజ్ వేడుకలు మహిళలు ఘానంగా జరుపుకుంటారు.తీజ్ వేడుకలు ప్రారంభం రోజు నుండి మహిళలు కుండీలలో నారు పోసి తొమ్మిదవ రోజున గ్రామ శివారులలో నిమజ్జన వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య అరుణ్ నాయక్, ఎంపీటీసీసభ్యురాలు భూక్య లావణ్య గంగాధర్ రాథోడ్, మాజి జెడ్పిటిసి భూక్య సరళ సురేందర్ నాయక్,జగిత్యాల రూరల్ ఏడిఈ భూక్య జవహర్లాల్ నాయక్, భూక్య దశరథ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.