ఖమ్మం: కూసు మంచి మండలం నాయకన్ గూడెం శివారు లో హత్య జరిగింది. నాయకన్ గ్రామానికి చెందిన వెంకటాచారి అనే ఉపాధ్యాయుడి ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. వెంకటాచారి నడిగూడెం మండలం రామచంద్రపురం ప్రభుత్వ పాఠశాల లో ఉపాద్యాయుడి గా పని చేస్తున్నారు.
Also Read: Nellore Gold Coins: తేనె కోసం వెళ్తే బంగారు చెంబు దొరికింది
రోజూ లాగానే పాఠశాల కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నాయకన్ గూడెం శివారు లో గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కూసుమంచి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.