ప్రాధాన్యత భవన నిర్మాణాల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఇంజనీర్లను సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడమని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని గతంలో పదేపదే పలుమార్లు చెప్పినప్పటికీ అలక్ష్యం చేసి ప్రగతి చూపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రగతిపై ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్న నేపథ్యంలో ప్రగతి తీసుకో రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలకు నిధుల కొరత లేదని, సిమెంట్ కూడా స్థానికంగా కొనుగోలు చేసి బిల్లులు సమర్పించాలని గతంలో నిర్దేశించి ఉన్నామని అయినప్పటికీ నిర్మాణాల ప్రగతిలో ఇంజనీరింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. నిర్లక్ష్యం చేస్తూ ప్రగతి చూపని ఇంజనీర్ల పై సస్పెన్షన్ కు చర్యలు తీసుకోమని సిఫారసు లేఖలు కూడా ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు.
కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి.. ఈటల జమున..
రూప్ స్థాయిలో ఉన్న 87 ప్రాధాన్య భవనాలను స్లాబ్ స్థాయికి తీసుకురావాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే స్లాబ్ స్థాయిలో ఉన్న 114 భవనాలను ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాల పురోగతిపై ప్రతిరోజు సమీక్షించి రోజువారీ నివేదికలు అందజేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 414 గ్రామ సచివాలయాల భవనాలకు కాను 208 భవనాలు, 393 రైతు భరోసా కేంద్రాలకు గాను 108 భవనాలు, 267 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలకు గాను 45 భవన నిర్మాణ పనులు పూర్తయినట్లు కలెక్టర్ కు పంచాయతీరాజ్ ఎస్ఈ రామ్మోహన్ నివేదించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డిఇలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు