తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన తెలంగాణా రన్ కు ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు హాజరయ్యారు. ప్రముఖ క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, ప్రముఖ సింగర్ మంగ్లీ, సినీ నటి శ్రీ లీల లు హాజరయ్యారు. మంగ్లీ, రామ్ లు తమ పాటలతో రన్నర్లకు హుషారు కల్పించారు.