ఏలూరు జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు మణిపాల్ ఆసుపత్రికి తరలించామని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత వెల్లడించారు. మహిళపై యాసిడ్ తో దాడి విషయం తెలియగానే ఏలూరు జిల్లా ఎస్పీతో ఫోన్లో హోం మంత్రి మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలకు అధికారులను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుంది. దాడిలో బాధితురాలికి కుడివైపు కన్నుకి, చాతి కుడివైపున గాయాలు అయినట్టు నిర్ధారణఅయిందని మంత్రి అన్నారు.