బూర్గంపాడు
మండలం గౌతమీపురం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు. ఈసందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి తగిన కళ్లద్దాలు, మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగుందని, కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ సిబ్బంది కోరారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవతం చేయటానికి అందరు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో బూర్గంపాడు మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు జక్కం సుబ్రహ్మణ్యం, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, వార్డు సభ్యులు సంపత్, అప్పల నాయుడు, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు, సౌకత్ అలీ, కైపు శ్రీనివాసరెడ్డి, ఆరోగ్యం శాఖ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి సాంబయ్యపార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.