కడప: కడప జిల్లా పులివెందులలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందాడని ముందుగా నాకు తెలియజేసింది వివేకానంద రెడ్డి బామ్మర్ది శివ ప్రకాష్ రెడ్డి. సంఘటన స్థలానికి నేను వెళ్ళగానే అక్కడ రక్తపు మడుగులు చూసి పోలీసులకు మొదటగా ఫోన్ చేశానని తెలిపారు. వివేక పీఏ కృష్ణారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి లెటర్ తాము వచ్చినంత వరకు ఎందుకు దాచి పెట్టాల్సి వచ్చిందో నిజం తేల్చాలని అన్నారు. హత్యకు ముఖ్య కారణం స్టాంపులు మరియు దస్తావేజులే. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ లో హత్య జరిగిన రోజు వైయస్ వివేక కొన్ని దస్తావేజులను తీసుకెళ్లినట్లు తెలిపారని అన్నారు.
సిబిఐ అధికారులు వాటిని పక్కన పెట్టి ఈ కేసులో ఎక్కడె కానీ దొంగతనానికి సంబంధించిన సెక్షన్ లేకపోవడం ఆశ్చర్యకరం. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి సిబిఐ విచారణ జరుగుతుంది. ఏ4 నిందితుడు దస్తగిరి చెప్పే మాటలు మాత్రమే వింటున్నారు. దస్తగిరి నిందితుడు అయినప్పటికీ యాంటీస్పెక్టరి బెల్ మంజూరు అవుతుంది. దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ కు మాత్రం సునీత, సిబిఐ అధికారులు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని మిగతా మిగిలిన వ్యక్తులకు యాంట్ రెస్పెక్టరీ బెయిల్ పెట్టుకుంటే మా సోదరి సునీత కౌంటర్ దాఖలు చేస్తుందని అన్నారు .