ఆధ్యాత్మిక, మానవసేవ రంగాలలో విశ్వవ్యాప్తంగా కృషి చేస్తున్న శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ విశ్వవ్యాప్తి జ్ఞానానికి ప్రతీక అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి యు. సూర్యప్రకాశసం పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 మే 13న తమిళనాడులో శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ జన్మించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత పై ఆచరణాత్మక, అనుభవ పూర్వక కోర్సులను ఆయన ప్రారంభించారని అన్నారు.
బజరంగ్ బలి’ నినాదాలతో హోరెత్తిన ఏఐసీసీ కార్యాలయం.
విద్య, మానవసేవరంగాల్లో సేవలు అందించడానికి గాను 1981లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి 152 దేశాలలో సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రజలలో మానవతా విలువలను తిరిగి పాదుగోల్పడం, స్వయం సమృద్ధి, స్వయం చాలిత అభివృద్ధి పథకాలను అమలు చేయడం ఈ సంస్థ లక్ష్యాలని సూర్య ప్రకాశం తెలిపారు. అనంతరం పేద మహిళలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ నరేష్ కుమార్, అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.