Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

శ్రీలీల ఎంట్రీతో సైడైన స్టార్ హీరోయిన్స్

1

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అదృష్టం లేకుంటే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే కెరీర్ ముగిసిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి పాత్రలు వచ్చినా తప్పకుండా చేయాలి. ఇలా చాలా మంది హీరోయిన్లు కొంత కాలం హీరోయిన్లుగా నటించి తల్లులుగా నటించి మరి కొంత కాలం అమ్మమ్మగా నటించాల్సి వస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, తమన్నా, అనుష్క, పూజా హెగ్డే ల కెరీర్ త్వరలోనే ముగియనుందని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఈ నలుగురూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసారు. స్టార్ హీరోలందరూ తమ సినిమాల్లో ఎక్కువగా సమంత, తమన్నా, అనుష్క, పూజాలను హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత రెండు మూడేళ్లుగా సామ్, తమన్నా, అనుష్కలు పెద్దగా హిట్ కొట్టలేకపోతున్నారు. అవకాశాలు వచ్చినా ఈ హీరోయిన్స్ వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం సమంత, తమన్నా, అనుష్క చిన్న హీరోల సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ కు అలాంటి భాగ్యం దక్కిన సంగతి తెలిసిందే.

Sreleela dominating other actress1
అయితే ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ఈ అమ్మడు రెండు సినిమాల్లోనే నటించినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందుకే ఇప్పటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో శ్రీలీలనే హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో పాటు ప్రతిభ కూడా దీనికి కారణం. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా శ్రీలీలకే ఓటు వేస్తారు. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘ధమాకా’ సినిమా తర్వాత దర్శకులు, హీరోలంతా శ్రీలీల కోసం క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ భామ బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడికి క్రేజ్ పెరుగుతుండడంతో తమన్నా, సమంత, అనుష్క, పూజా హెగ్డేలు వెనకబడ్డారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

1 Comment
  1. sudarshan says

    Very Nice Content

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie