తిరుపతి:తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కల నియంత్రణకు నిబంధనల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత స్పష్టం చేసారు. వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలనే పిర్యాధులు తరుచుగా రావడంపై దృష్టి సారించిన కమిషనర్ హరిత గురువారం తూకివాకం దగ్గర కుక్కల జనన నియంత్రణ సంరక్షణ కేంధ్రాన్ని పరిశీలించారు. అనంతరం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొనగా మునిసిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, అనిమల్ కేర్ ల్యాండ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ, సుప్రిం కోర్ట్ మార్గదర్శకాలు ప్రకారం వీధి కుక్కలను పట్టుకొని జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడం, రాబిస్ టీకాలు వేయించడంతో బాటు వాటిని వారం రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షనలో సంరక్షించిన తరువాత తిరిగి వాటిని పట్టుకున్న చోటనే విడిచిపెట్టడం చేయాలన్నారు.
వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు వాటికి గాయాలు కాకుండా పట్టుకోవాలన్నారు. అనిమల్ కేర్ ల్యాండ్ వారికి ఓక కుక్కను పట్టుకొని ఆపరేషన్ చేసి, రాబీస్ టీకాను వేసి అనంతరం విడిచిపెట్టేందుకు ఒక కుక్కకు పన్నెండు వందలు ఇస్తున్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేస్తూ, పట్టుకుంట్టున్న ప్రతి ఓక్క కుక్క వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కుక్కల్ని పట్టుకున్న వార్డులోని సంబంధిత సచివాలయ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలన్నారు. తూకివాకంలోని వీధి కుక్కల జనన నియంత్రణ, రాబీస్ టీకాల కేంధ్రాన్ని పరిశుభ్రంగా వుంచాలని శూచిస్తూ తగిన సూచనలను హరిత తెలియజేసారు.