యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కళ్లు.. ఎవరినైనా ఆకట్టుకునే స్మైల్.. గ్లామర్ ప్లస్ యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువచ్చిన హీరోయిన్.. సౌమ్య మీనన్ . అప్పటికే హీరోయిన్, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి తన పక్కన యాక్ట్ చేయాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ అందాల సుందరి. సర్కారివారిపాట’ సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘సర’ లో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్తూ, ఈ మూవీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించని బ్యాక్ డ్రాప్‌లో వి.శశిభూషణ రైటింగ్ అండ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నట్టు చెప్పారు.