Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అత్తమామల హత్యకు అల్లుడు స్కెచ్

0

సంగారెడ్డి:కరెంట్ షాక్ తో అత్తమామలని హత్య చేయాలని స్కెచ్ వేసిన అల్లుడు అరెస్ట్ అయ్యాడు.ఇంటికి వస్తే పిలిస్తే పలకలేదన్న కొపంతో అత్తమామలను చంపాలని  అల్లుడు రమేష్ ప్లాన్ వేసాడు. ఘటన నారాయణ్ ఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో జరిగింది. ఈ నెల 12న అందరూ పడుకున్నాక  మీటర్ నుంచి ఇంటి  తలుపులకు కరెంట్ కనెక్షన్ పెట్టాడు.

పొలం దగ్గర ఉన్న రెండు బోరు మీటర్లను  నిందితుడు వరిగడ్డి వేసి తగలబెట్టాడు. ఉదయం లేచి తలుపు తిస్తే ఇంట్లో ఉన్న తల్లికూతుర్లకు కరెంట్ షాక్ కొట్టింది. వారు  కేకలు వేయడంతో స్థానికులు గమనించి విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంతో ప్రమాదం తప్పింది.  విచారణలో అల్లుడే నిందితుడని పోలీసులు తేల్చారు. హత్యకు ప్లాన్ చేసిన అల్లుడు రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie