Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మార్చి 30న సీతారాముల కల్యాణం

0

ఖమ్మం ఫిబ్రవరి 7
భద్రాద్రి సీతారాముల కల్యాణ తేదీని వైదిక కమిటీ నిర్వాహకులు ఖరారు చేశారు. మార్చి 30న సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ప్రతి యేట మాదిరిగానే ఈ సారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie