అల్లూరి సీతారామరాజు: అల్లూరి జిల్లా విలీన మండలాల్లో గత మూడు రోజులుగా ఎడతెరపి లేని వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు మండలం ముకునూరు బ్రిడ్జి పైకి నీరు చేరడంతో రెండు మండలాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.చీకటి వాగు పొంగి రహదారిపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం అలాగే వి.ఆర్ పురం మండలం అన్నవరం వాగు పొంగడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, కూనవరంలో గోదావరి నది 30 అడుగుల వద్ద,చింతూరులో శబరి నది 29.5 అడుగుల వద్ద ప్రవహిస్తున్నాయి, దీంతో ఇక్కడి గిరిజనుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే వర్షాలు,వరదలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో చింతూరు ఐటీడీఏ పి ఓ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు సురక్షితమైన ఎత్తిన ప్రదేశాలకు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగులకి వరద ప్రవహించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.