యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో పోచంపల్లి కి చెందిన దాదాపు వంద మందికి పైగా ముఖ్య నాయకులు అంతా కమలం పార్టీలోకి చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న గూడూరు నారాయణ రెడ్డి నాయకత్వములో.. పోచంపల్లి పట్టణములోని వివిధ పార్టీలకు చెందిన 100 మంది ముదిరాజ్ సంఘం నాయకులకు Telangana State Election Committee Chairman Etela Rajender తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వములో.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మోడీ నాయకత్వములో పనిచేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి నుంచి బిజెపి పార్టీ లో చేరినవారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాషాయ జెండా ఎగురవెయ్యాలని ఈటల రాజేందర్ అన్నారు.