- పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లకు అనుమతి లేదు
- పదవ తరగతి పరీక్షలకు పటిష్ట చర్యలు
- అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్
కరీంనగర్: జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విధులకు హజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, ఆకస్మిక తనిఖికి వచ్చే వారు ఎవరైన సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ తో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పదవ తరగతి పరీక్షల నిర్వహణ, చేపట్టవలసిన ఎర్పాట్లపై హైదరాబాద్ నుండి విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాల కలెక్టర్లు, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో చేపడుతున్న ఏర్పాట్లను గురించి మంత్రికి, అధికారులకు అడిషనల్ కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో. 76 పరీక్ష కేంద్రాలలో రెండు రోజులు జరిగిన పదవ తరగతి పరీక్షల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగాయని, ఇకపై జరిగే పరీక్షలను కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఇప్పటికే జిల్లాస్థాయి సమావేశాలను నిర్వహించుకొని పలు సూచనలను, ఆదేశాలను జారిచేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టంగా 144 సెక్షన్ ను అమలు చేయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఆశా, ఎఎన్ఎంలనకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్, రెవెన్యూ, ఫ్లయింగ్ స్కౌడ్స్ అధికారులను అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు.ఇకపై జరుగనున్న పరీక్షలకు స్థానిక మండల తహసీల్దార్లు, యంపిడిఓలు, ఇతర సంబంధిత మండలస్థాయి అధికారులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని సూచించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల వద్ద ఎవరు కూడా గుమ్మిగుడి ఉండకుండా స్థానిక ఎస్సై ద్వారా పరిసర ప్రాంతాలను పర్యవేక్షించేలా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు హజరయ్యే సిబ్బంది ఎవరికి కూడా పరీక్ష కేంద్రంలోని సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో అనుమంతించ కుండ కట్టుదిట్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల ఆకస్మిక తనిఖీకి వచ్చే అధికారులు ఎవరైన సరే వారిని కూడా సెల్ ఫోన్ తో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, పశ్నాపత్రాలను కేంద్రాలకు చేర్చడం మొదలు పరీక్షా అనంతరం జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు చేర్చడం వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, పశ్నాపత్రాల తరలింపులో వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లయితే వాటి జాబితాను నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదనపు పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వారీగా పగడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందని, ఎస్సై స్థాయి అధికారిని అప్రమత్తంగా ఉంచడం జరిగిందని, ప్రతిరోజు పరీక్ష ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డిఓలు ఆనంద్ కుమార్, హరిసింగ్ లు, విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, ఏసీపీలు కరుణాకర్, తుల శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గోన్నారు.