- సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ రాజేష్
- 23 వార్డు లో అక్రమ నిర్మాణల కు స్థానిక ప్రజాప్రతినిధి అండ….!!!!
- బిల్డర్ కు కొమ్ముకాస్తున్న టీపిఓ తేజ….? విశాఖపట్నం
జీవీఎంసీ పరిధి 23 వార్డు లో ఇటీవల అక్రమనిర్మాణల జోరు పెరిగింది. దీనికి ప్రధాన కారణం స్థానిక ప్రజాప్రతినిధి అక్రమ నిర్మాణదారులకు అండగా నిలబడటమే. వార్డు లోని చైతన్యనగర్ లోని డోర్ నెం.51-8-40/84 చిరునామా లో ఇరుకు సందులో బహుళ అంతస్తుల నిర్మాణం వెనుక భారీ గా ముడుపులు చేతులు మారాయి. స్థానిక ప్రజాప్రతినిధి అక్రమ నిర్మాణం జోలికి వెళ్లకుండా టౌన్ ప్లానింగ్ అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నారు. టీపీఓ తేజ కూడ అక్రమ నిర్మాణ దారులకు కొమ్ముకాయడం తో వార్డు లో నిబంధనలు పట్టని నిర్మాణల సంఖ్య భారీ గా పెరిగాయి.జీవీఎంసీ కమీషనర్ సాయికాంత్ శర్మ వార్డు లోని అక్రమ నిర్మాణల పై ప్రత్యేక దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.