క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన.. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈవీ అయింపర్ అనే బోగస్ కంపనీ నడుస్తుంది.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు ఆదాయం వస్తుందని అమాయకులను నమ్మిస్తున్నారు అని సీపీ ఆనంద్ అన్నారు.ఇది గొలుసు కట్టు పద్దతిలో అమాయకులను మోసం చేస్తున్నారు
అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 159 మంది బాధితులు దాదాపు రూ. 3 కోట్లుకు పైగా డబ్బును పోగొట్టుకున్నారు అని సీపీ తెలిపారు. క్యూ నెట్ స్కామ్ పై సీసీఎస్ పోలీసులు ఒకవైపు.. మరో వైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది అని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా క్యూట్ నెట్ నడిపిస్తున్న రాజేష్ కన్నాను మొట్టమొదటి సరిగా అరెస్ట్ చేశాము అని ఆయన అన్నారు.35 బ్యాంక్ అకౌంట్లు.. రూ. 54 కోట్లు నగదును ఫ్రీజ్ చేశాము అని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ చెప్పారు. సూపర్ మార్కెట్ స్కీం ద్వారా 44 మంది బాధితులను తాము గుర్తించాము అని అన్నారు.
ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఆకాంక్షే ఈ తొమ్మిదేళ్ల పాలన.
రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు లక్ష రూపాయలు వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారు.. ఇలా రెండు మూడు నెలలు అమౌంట్ ఇచ్చి మరీ మాయం అయిపోతున్నారు.. దేశంలోనే వేయి కోట్ల బిజినెస్ చేసినట్లు గుర్తించాము అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.ఆయుర్వేద మందుల పేరుతో ప్రాడక్ట్ ఇచ్చి చాలా రకాల మోసం చేస్తున్నారు.. పిరమిడ్ స్కీంపై తెలంగాణలో 2017 డైరెక్ట్ సెల్లింగ్ గైడెలెన్స్ ప్రకారం చట్ట విరుద్ధం..స్వప్న లోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో చనిపోయిన బాధితులు కూడా క్యూ నెట్ లో పెట్టి మోసపోయారు.. ప్రజలు ఇలాంటి మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.