నెహ్రూ జూలాజికల్ పార్కులో పుష్ప సినిమా స్టైల్లో ఏడు గంధపు చెట్ల చోరీ
Seven sandalwood trees stolen in pushpa movie style at Nehru Zoological Park
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో రెండు రోజుల క్రితం దొంగలు పడ్డారు. పుష్ప సినిమా స్టైల్లో ఏడు గంధపు చెట్ల నరికి, చిన్నచిన్న దుంగలుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా జూపార్క్ దాటించేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి జూపార్కులో పెరు గుతున్నది గంధపు చెట్లని చాలామందికి తెలియదు. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచారు జూపార్కు అధికారులు. కానీ స్మగ్లర్లు కనిపెట్టాశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు గంధం చెట్లను మాయం చేశారు. ఈ గంధం చెట్ల మాయం వ్యవహారం ఒక్కరోజులో జరిగింది కాదు. చెట్లు నరికిన విధానం బట్టి చూస్తే. కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతన్నట్లు అధికారులు తేల్చారు. జూపార్కులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. గంధం చెట్లు మాయం వ్యవహారం ఈనెల 20వ తేదీన బయటపడింది. అప్పటి నుంచి అధికారులు నిఘాపెట్టారు. .
Also Read: వింక్ బ్యూటీ హాట్ హొయలు
ఇంకొన్ని దుంగలను అక్కడే కట్టలుగా ఉంచారు. వాటిని ఎవరైనా స్మగ్లింగ్ చేయడానికి వస్తారా? అన్న కోణంలో నిఘా పెట్టారు. కాని మూడు రోజులైనా ఎవరూ రాకపోవడంతో.. జూపార్క్ అధికారులు ఉన్నతాధి కారులకు సమాచారాన్ని చేరవేశా రు. పార్కుకు రెండు వైపులా ప్రవేశ ద్వారాలు ఉండడం, ఆ రెండు ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా ఆ గేట్ ల గుండా గంధపు దుంగలను తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. నరికిన ఏడు గంధపు చెట్లనుంచి కొన్ని దుంగలు కనిపించకుండా పోయినా… అవి ఎలా తస్కరించారన్నది ప్రశ్న గా మారింది.
sandalwood trees stolen: స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు ఆరా!
ఆరేళ్లలో ఐదుసార్లు స్మగర్లు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్కరూ కూడా పట్టుబడలేదు. ఈ వ్యవహారాన్ని అధికారులు ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటారో..? లేదో? వేచిచూడాలి.